డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అల్లరి నరేష్ “ఉగ్రం”

Published on May 31, 2023 2:44 pm IST


టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ఉగ్రం. నాంది లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం అనుకున్న రీతిలో వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

జూన్ 2, 2023 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం ప్రసారం కానుంది. మిర్ణా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :