బుక్ మై షోలో ‘యూఐ’ ర్యాంపేజ్

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యూఐ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కడం తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమాకు కన్నడనాట తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 550,000 పైగా టికెట్లు అమ్ముడైన మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

యూఐ సినిమాలో ఉపేంద్ర డ్యూయల్ రోల్‌లో నటించగా రీష్మ నానయ్య హీరోయిన్‌గా నటించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

Exit mobile version