లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి డీసెంట్ బజ్ నడుమ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ని అయితే ఆడియెన్స్ లో సొంతం చేసుకుంది. అయితే ఈ అవైటెడ్ సీక్వెల్ లోనే పార్ట్ 3 సంబంధించి ట్రైలర్ కూడా ఉంటుంది అని మేకర్స్ ముందే కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ ట్రైలర్ ఇప్పుడు ఎట్టకేలకి థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే సినిమా సంగతి పక్కన పెడితే ఈ ఇండియన్ 3 ట్రైలర్ కి మాత్రం ఆడియెన్స్ నుంచి యూనానిమస్ గా పాజిటివ్ టాక్ మాత్రమే వస్తుంది. ఇంకా సినిమాని కేవలం రెండు పార్టులుగా తీసి దీన్ని పెట్టేసి ఉంటే టాక్ కూడా అదిరిపోయేది అని నెటిజన్స్ అంటున్నారు. దీనితో ఈ సినిమా విషయంలో మాత్రం ఇపుడు మంచి బజ్ నెలకొంది. ఇక శంకర్ అయితే ఈ సినిమాని 2025 లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.