పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ (Sruthi Haasan) హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా థియేటర్స్ లో రికార్డు వసూళ్లు అందించారు. మరి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ చిత్రం తరువాత ఓటిటిలో కూడా భారీ రెస్పాన్స్ ని నమోదు చేసింది.
అయితే ఈ చిత్రం గత కొన్ని రోజులు కితం తెలుగులో స్టార్ మా ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి రాగా రేటింగ్ ఇప్పుడు బయటకి వచ్చింది. భారీ చిత్రం అందులోని ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పైగా సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేశారు. అయినా కూడా ఈ చిత్రానికి కేవలం 6.5 రేటింగ్ పాయింట్స్ మాత్రమే వచ్చింది.
ఇది ఒకింత తక్కువే అని చెప్పవచ్చు కానీ అప్పటికే ఓటిటిలో సలార్ ని చాలా ఎక్కువ మందే చూసేసారు. పైగా థియేటర్స్ లో వచ్చిన నెలన్నర లోపే ఓటిటిలోకి వచ్చేయడంతో అంత గ్యాప్ కూడా లేదు అలా ఓటిటిలో ఎక్కువమంది అప్పటికే చూసేయడం మూలాన స్మాల్ స్క్రీన్ పై తక్కువ వచ్చి ఉండొచ్చు అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ రేటింగ్ కోసమే ఫ్యాన్స్ నడుమ చర్చ నడుస్తుంది.