“ప్రాజెక్ట్ కే” షూట్ అప్పుడే అంత అయిపోయిందా..!

Published on Aug 12, 2022 10:25 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ వరకు కూడా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన భారీ చిత్రం “ప్రాజెక్ట్ కె” శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పై అయితే ఓ ఊహించని అప్డేట్ బయటకి వచ్చిందని చెప్పాలి.

ఈ చిత్ర నిర్మాత లేటెస్ట్ గా ఈటీవీలో అలీతో సరదాగా షో లో హాజరు కాగా ఈ ఎపిసోడ్ లో ప్రాజెక్ట్ కె షూట్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి ఆల్రెడీ 55 పర్సెంట్ అయిపొయింది అని రీసెంట్ గా మరో షెడ్యూల్ చేసి ఉంటే ఇంకా అయిపోయి ఉండేది అని తెలిపారు. దీనితో అప్పుడే ఈ సినిమా షూటింగ్ ఇంత కంప్లీట్ చేసారా అని అయితే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :