ఆ బాధ్యతలకు ప్రత్యేక కృతజ్ఞతలు – కరీనా

బాలీవుడ్ లో క‌రీనా కపూర్ కి నేటికీ ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఆమె తన కెరీర్ ను రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా కంటిన్యూ చేస్తూ వస్తోంది. అటు లేడీ ఓరియేంటెడ్ పాత్ర‌ల‌తోనూ కరీనా కపూర్ ఆకట్టుకుంది. అలాగే సామాజిక కార్య‌క్ర‌మాలకు క‌రీనా మ‌ద్ద‌తు ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే యూనిసెఫ్‌ (యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF‌) ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌ గా కరీనా కపూర్‌ బాధ్యతలు చేపట్టింది.

పిల్ల‌ల హ‌క్కుల‌పై.. భ‌విష్య‌త్ త‌రాల కోసం.. విద్య.. లింగ స‌మాన‌త్వం వంటి అంశాల‌పై క‌రీ కపూర్ ప్ర‌చారం చేయ‌నుంది. ఐతే, ఈ విషయం పై కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘యూనిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా నన్ను నియమించడం చాలా గర్వంగా ఉంది. దేశంలోని మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

Exit mobile version