అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవచ్చు.. కానీ..

Published on Sep 30, 2020 9:53 pm IST


సినీ ప్రేమికులు, సినీ జనాలు ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్‌లు మూతబడే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందన్న అనుమానం రాగానే మొదటగా మూసివేసింది సినిమా హాళ్ళే. ఇప్పటి వరకు నాలుగు దశల్లో అన్‌లాక్ మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం వేటిలోనూ సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వలేదు. చివరికి తాజాగా ప్రకటించిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాల్లో మాత్రం సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు తెరుచుకోవచ్చని తెలిపింది.

ఈ తాజా మార్గదర్శకాలతో దాదాపు ఆరు నెలల నుండి మూతబడి ఉన్న సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఉన్న థియేటర్లు అక్టోబర్ 15 నుండి తెరుచుకోవచ్చు. కానీ 50 శాతం సీట్లతోనే థియేటర్లు నడపాల్సి ఉంటుంది. అలాగే సామాజిక దూరం, రెగ్యులర్ శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఛాన్నాళ్ళకు థియేటర్లు తెరుచుకుంటుండటంతో వేల మందికి మళ్లీ ఉపాది దొరకనుంది. అన్నీ పనులు ముగిసి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలకు మోక్షం లభించనుంది.

సంబంధిత సమాచారం :

More