వరల్డ్ వైడ్ “మార్కో” సాలిడ్ వసూళ్లు.!

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా ఆడియెన్స్ ని స్టన్ చేసిన క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “మార్కో”. మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన క్రేజీ వైలెంట్ యాక్షన్ డ్రామా ఇది కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించారు. మరి మొదట మలయాళంలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అక్కడ యూనానిమస్ టాక్ ని తెచ్చుకుని హిందీ సహా తెలుగులో కూడా వచ్చింది.

అయితే విడుదల అయ్యిన అన్ని చోట్లా వైలెంట్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఇపుడు వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి ఉన్ని ముకుందన్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. మరి తెలుగులో కూడా మలయాళ సినిమాల్లో అన్నిటికంటే అత్యధిక ఓపెనింగ్స్ అందుకోగా నెక్స్ట్ మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇలా మొత్తానికి అయితే మార్కో సంచలనం గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందించగా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఈ చిత్రం దూసుకెళ్తుంది.

Exit mobile version