పిక్ టాక్ : పవన్ బర్త్‌ డేకి స్పెషల్ అట్రాక్షన్ ఇదే

పిక్ టాక్ : పవన్ బర్త్‌ డేకి స్పెషల్ అట్రాక్షన్ ఇదే

Published on Sep 2, 2024 9:34 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ హడావుడే కనిపిస్తోంది. పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో అభిమానులు ఫుల్ బిజీ అయిపోయారు. ఐతే, మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ రేర్ ఫోటోని షేర్ చేస్తూ పవన్ కి స్పెషల్ బర్త్‌ డే విషెస్ చెప్పారు. ముఖ్యంగా చిరు షేర్ చేసిన ఈ రేర్ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

పవన్ కళ్యాణ్ భుజాల పై చిరంజీవి చేయి వేసి స్టైల్ గా కూర్చోవడం, పవన్ కి అటు వైపు సురేఖగారు నిలబడి నవ్వుతూ కనిపించడం, మధ్యలో పవన్ వినయంగా చూస్తూ ఉండటంతో ఈ పిక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ అరుదైన పాత ఫోటో గతంలో ఎన్నడూ ఫ్యాన్స్ కంట పడలేదు. దీంతో.. పవన్ పుట్టినరోజుకి ఈ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

దీనికితోడు, మెగాస్టార్ ఈ రేర్ ఫోటో షేర్ చేస్తూ ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ‘కళ్యాణ్ బాబు… ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!’ అని చిరు పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు