మరింత ఆసక్తికరంగా ‘అన్ స్టాపబుల్ – 2’ పవన్ కళ్యాణ్ పార్ట్ 2 ప్రోమో

Published on Feb 5, 2023 10:31 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా లోని అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రస్తుతం మరింత మంచి ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకెళుతోంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షో కి ప్రత్యేక గెస్ట్ గా విచ్చేయగా, ఆయన పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్న ఆహా వారు, అందులో భాగంగా ఫిబ్రవరి 3న మొదటి భాగాన్ని ప్రసారం చేసారు.

కాగా దానికి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ ఎపిసోడ్ యొక్క పార్ట్ 2 ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం, అందులో ఎదురైన ఒడిదుడుకులు, జనసేన పార్టీ గురించి, అలానే పవన్ తదుపరి కార్యాచరణ వంటి పలు అంశాలతో సాగనున్నట్లు ప్రోమోలో చూపించారు. మొత్తంగా అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన పార్ట్ 2 ప్రోమో కి ప్రస్తుతం వ్యూస్ లభిస్తున్నాయి. కాగా పార్ట్ 2 ఫుల్ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 10న ప్రసారం చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :