‘అన్‌స్టాపబుల్-4’ గ్లింప్స్.. ఆకాశంలో సూర్యచంద్రులు.. ఏపీకి బాబు, కళ్యాణ్ బాబు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ టాక్ షో త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇక ఈ టాక్ షోను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ తొలి ఎపిసోడ్‌కు చీఫ్ గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ‘‘మా బావ గారు.. మీ బాబు గారు..’’ అంటూ చంద్రబాబుని బాలయ్య ఇంట్రొడ్యూస్ చేసిన విధానం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక ‘‘ఆకాశంలో సూర్యచంద్రులు.. ఏపీలో బాబు, పవన్ కళ్యాణ్ బాబు’’ అనే డైలాగ్ కూడా ఈ వీడియో గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది.

అన్‌స్టాపబుల్-4 టాక్ షోను అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వెల్లడించింది. దీంతో ఈ షోపై అప్పుడే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

Exit mobile version