అన్‌స్టాపబుల్ సీజన్ 4.. చరిత్రలో నిలిచిపోయే పండుగ!

అన్‌స్టాపబుల్ సీజన్ 4.. చరిత్రలో నిలిచిపోయే పండుగ!

Published on Oct 12, 2024 4:00 PM IST

నందమూరి బాలకృష్ణ దసరా పండుగ పూట తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఆయన హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. బాలయ్య సూపర్ హీరోగా తన అభిమానులను అలరించాడు.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య సరికొత్త సూపర్ హీరోగా మారి అభిమానులకు చరిత్రలో నిలిచిపోయే పండుగను ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 4 రూపంలో అందించబోతున్నట్లుగా ఈ టాక్ షో ట్రైలర్‌లో ఎలివేట్ చేశారు. కామిక్ వర్షన్‌తో పాటు బాలయ్య తనదైన లుక్‌తో ఈ ట్రైలర్‌లోకనిపించి అభిమానులకు అసలైన పండుగ ట్రీట్ ఇచ్చాడు. ఇక అభిమానులకు ఇది బాలయ్య పండుగ అని ఆహా నిర్వాహకులు తెలియజేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ఈసారి మరింత ఘాటైన ప్రశ్నలతో బాలయ్య తన గెస్టులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాడని ఈ ట్రైలర్‌లో తెలిపాడు. ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ప్రెస్టీజియస్ టాక్ షోను అక్టోబర్ 24న గ్రాండ్ లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు