ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న ‘అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’ ఎపిసోడ్ 1 ప్రోమో

ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న ‘అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’ ఎపిసోడ్ 1 ప్రోమో

Published on Oct 13, 2023 10:04 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలకృష్ణ కుమార్తెగా యువ నటి శ్రీలీల నటించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా హరీష్ పెద్ది, సాహు గారపాటి దీనిని భారీ స్థాయిలో నిర్మించారు.

ఇక మరోవైపు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రేజీ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్స్ తో అదరగొట్టిన ఈ షో యొక్క లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17న ప్రసారం కానున్నట్లు ఇప్పటికే ఆహా వారు ప్రకటించారు. తాజాగా ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు.

కాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి భగవంత్ కేసరి టీమ్ ప్రత్యేకంగా విచ్చేసారు. హీరోయిన్స్ కాజల్, శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటుడు అర్జున్ రామ్ పాల్ సరదాగా ఫుల్ ఫన్ అండ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ తో సందడి చేసిన అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ యొక్క ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్ ని అక్టోబర్ 17న సాయంత్రం 6 గం. లకు ఆహాలో ప్రసారం చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు