అన్ స్టాపబుల్ : మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ ఎపిసోడ్ కి ప్లానింగ్ ?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి రేపు సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. విషయం ఏమిటంటే, ఇప్పటికే ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహాలో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షో కి అతి త్వరలో మహేష్ బాబు, త్రివిక్రమ్ స్పెషల్ గా విచ్చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్.

ఇప్పటికే ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ఆహా వారు ప్లానింగ్స్ మొదలెట్టినట్లు చెప్తున్నారు. నిజానికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షోకి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఒక ఎపిసోడ్ కి విచ్చేసి సందడి చేసారు. ఆ ఎపిసోడ్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. అయితే మహేష్, త్రివిక్రమ్ ల స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ఆహా వారి నుండి మాత్రం అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version