లేటెస్ట్ : రికార్డులు తిరగరాస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రభాస్ ఎపిసోడ్


ప్రస్తుతం తన సినీ కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం అవుతున్న క్రేజీ ఎంటర్టైన్మెంట్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసారు. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ విచ్చేసిన ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆహా టీమ్, మొన్న రాత్రి మొదటి భాగాన్ని ప్రసారం చేసింది.

అయితే ఒక్కసారిగా ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన రావడంతో ఒకానొక సమయంలో ఆహా యాప్ క్రాష్ కూడా అయింది. ఇక అక్కడి నుండి ఈ ఎపిసోడ్ మరింతగా అందర్నీ ఆకట్టుకుంటూ 50 మిలియన్ మినిట్స్ వ్యూస్ చేరుకోగా, నేడు అది ఏకంగా 100 మిలియన్ మినిట్స్ అందుకుని రికార్డు సృష్టించిందని ఆహా వారు కొద్దిసేవటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనౌన్స్ చేసారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ కి ఇంతగా భారీ రెస్పాన్స్ వస్తుండడంతో ఆహా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version