ఆకట్టుకుంటోన్న అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ 4 ప్రోమో


నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఒటిటి మాధ్యమం ఆహా లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇప్పటికే ఈ సీజన్ లో పూర్తి అయిన మూడు ఎపిసోడ్స్ కూడా ఆడియన్స్ ని ఎంతో బాగా ఎంటర్టైన్ చేసాయి. ఇక నవంబర్ 25న నాలుగవ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఆ ఎపిసోడ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. కాగా ఎపిసోడ్ 4 కి నటి రాధిక, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ప్రత్యేక గెస్టులు గా విచ్చేసారు.

ఇప్పటివరకు బాలయ్య ఫ్యాన్స్ ని అలానే కుటుంబాన్ని చూసారు, ఇప్పుడు స్నేహితులని చూడండి అంటూ ఈ ప్రోమో రిలీజ్ చేసారు. నిజానికి వారు ముగ్గురూ కూడా బాలయ్యకు స్నేహితులు కావడం అలానే ఈ ప్రోమోలో వారితో బాలయ్య పలు సరదా సంభాషణలతో ఆకట్టుకోవడం జరిగింది. మొత్తంగా అటు సరదాగా ఇటు ఒకింత ఎమోషనల్ గా పలు ఆసక్తికర ప్రశ్నలతో, సంభాషణలతో సాగిన ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ పై ఆడియన్స్ లో బాగా హైప్ ని ఏర్పరిచింది అనే చెప్పాలి. మరి ఈ క్రేజీ ఎపిసోడ్ కోసం మరొక వారం రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.

Exit mobile version