అన్ స్టాపబుల్ 2 – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్లింప్స్ రిలీజ్


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్న షో అన్ స్టాపబుల్ సీజన్ 2. సీజన్ 1 ని మించేలా అమరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ తో ప్రతి వారం ఆడియన్స్ నుండి ఎంతో క్రేజ్ తో కొనసాగుతున్న ఈ షో యొక్క తాజా ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు యాక్షన్ స్టార్ గోపీచంద్ స్పెషల్ గెస్టులుగా విచ్చేశారు.

కాగా కొద్దిసేపటి క్రితం ప్రభాస్ ఎపిసోడ్ తాలూకు చిన్న గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు ఆహా వారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్ ని చూస్తే ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో సరదాగా మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలతో సాగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ గ్లింప్స్ మంచి క్రేజ్ తో దూసుకెళ్తుండడంతో అతి త్వరలోనే దీని ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు ఆహా వారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఆహా టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version