నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల ప్రముఖ ఒటిటి మాధ్యమం ఆహాలో తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన షో అన్ స్టాపబుల్. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆ షోలో ప్రతి ఎపిసోడ్ కి గెస్ట్ లు గా వచ్చి తమ సినీ, వ్యక్తిగత విషయాలను ఆడియన్స్ తో పంచుకోవడం జరిగింది. ఆ విధంగా ఎంతో ఎంటర్టైనింగ్ గా సక్సెస్ఫుల్ గా జరిగిన సీజన్ 1 లో బాలయ్య తన మార్క్ హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే దాని అనంతరం ఆడియన్స్ అందరిలో సీజన్ 2 పై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక అందరి ఆసక్తిని రెట్టింపు చేసేలా, అంచనాలు అందుకునేలా నేడు కొద్దిసేపటి క్రితం అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమోని రిలీజ్ చేశారు ఆహా వారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ టీజర్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్ లో అదరగొట్టారు. ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ తో తలపై హ్యాట్ పెట్టుకుని, చేతిలో కత్తి పట్టుకుని ట్రెజర్ హంట్ మాదిరిగా సాగె కాన్సెప్ట్ తో రూపొందించబడిన ఈ బ్లాస్టింగ్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా త్వరలో సీజన్ 2 ప్రారంభ తేదీనిని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.