NBK అన్ స్టాపబుల్ సీజన్ 2 – అదిరిపోయిన గోపీచంద్ గ్లింప్స్


నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. ఇప్పటికే ఈ తాజా సీజన్ లో ప్రసారమైన ఎపిసోడ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని షో పై మరింతగా క్రేజ్ ఏర్పరిచాయి. ఇక తాజాగా ఈ షో యొక్క లేటెస్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ ఇద్దరూ కూడా విచ్చేసారు. గతంలో వీరిద్దరూ కలిసి వర్షం మూవీ కి వర్క్ చేసారు. అలానే మొదటి నుండి ఇద్దరి మధ్య మంచి స్నేహానుబంధం ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరికి సంబందించిన చిన్న గ్లింప్స్ టీజర్ మొన్న రిలీజ్ అయి ఆకట్టుకోగా నేడు కొద్దిసేపటి క్రితం ఈ ఎపిసోడ్ కి సంబంధించి గోపీచంద్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు ఆహా వారు. ఇక ఇందులో గోపీచంద్ మాట్లాడుతూ, అది 2008 అనుకుంట అంటూ ఒక విషయం చెప్పడం, సడన్ గా ప్రభాస్ ఒరేయ్ అంటూ ఆపడం ఇలా పలు అంశాలతో ఈ స్పెషల్ గ్లింప్స్ సరదాగా ఉంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తే ఈ తాజా ఎపిసోడ్ ఎంతో ఆకట్టుకునేలా మంచి ఎంటర్టైనింగ్ గా సాగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 31న ఆహా వారు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా న్యూస్ రావాల్సి ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version