మామకు తగ్గ కోడలు అనిపించిన ఉపాసన..!

Published on Apr 5, 2020 7:28 pm IST


రామ్ చరణ్ సతీమణి, చిరంజీవి కోడలు ఉపాసన కరోనా లాక్ డౌన్ వంటి కష్టకాలంలో పేద కార్మికులకు అండగా నిలబడి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఉపాసన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా గుర్తింపబడిన చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులకు అపోలో స్టోర్స్ నందు ఉచిత మెడిసిన్ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. అర్హత కలిగిన పేద సినీ కార్మికులకు అపోలో మెడికల్ స్టోర్స్ నందు అవసరమైన వారికి ఉచితంగా మెడిసిన్ ఇవ్వనున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ స్థాపించి భారీ విరాళం ఇవ్వడంతో పాటు, అందరు ప్రముఖుల వద్ద నుండి సేకరించారు. సినీ ప్రముఖుల నుండి వచ్చిన ఆర్ధిక సహాయాన్ని పేదలకు అందేలా నిర్మాణాత్మక చర్యలు తీసుకోనున్నారు. ఇప్పుడు చిరు కోడలు ఉపాసన ఈ నిర్ణయం తీసుకొని మామకు తగ్గ కోడలు అనిపించింది. సాయం చేయడంలో మామకు ఏమాత్రం తీసిపోదని ప్రూవ్ చేసింది.

సంబంధిత సమాచారం :

X
More