గందరగోళంలో పెద్ద సినిమాలు..

Published on Apr 13, 2021 11:10 pm IST


లాక్ డౌన్ ముగిసి సినిమా షూటింగ్స్ మొదలుకావడంతో అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడుతుండటంతో రిలీజ్ డేట్స్ లాక్ చేసి పెట్టుకున్నాయి. దాదాపు ప్రతి నెలలోనూ పెద్ద లేదా మధ్యతరహా సినిమాలు కనీసం మూడు విడుదలకు రెడీ అయ్యాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ అన్నిటినీ మార్చివేసింది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎప్పుడు థియేటర్లు మూసివేస్తుందో లేదంటే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను తీసుకొస్తుందో అనే అనుమానాలు మొదలయ్యాయి.

తీరా సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లో లాక్ డౌన్ పడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో పడ్డారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. ఇక తాజాగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చి టికెట్ రేట్లు భారీగా తగ్గించింది. ఈ రేట్లతో ఏసీ థియేటర్లు నడపడం కష్టమని అంటున్నాయి థియేటర్ యాజమాన్యాలు. కొందరైతే హాళ్లు మూసివేయాలనే ఆలోచనలో కూడ ఉన్నారు. ఇన్ని సమస్యల నడుమ సినిమాల విడుదల పెట్టుకుంటే కష్టమని భావించి సినిమాలు వెనక్కు తగ్గుతున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య, టక్ జగదీష్, లవ్ స్టోరీ’ చిత్రాలు వాయిదాపడగా ‘సీటిమార్, విరాట పర్వం, నారప్ప’ చిత్రాలు కూడ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :