‘ఓటీటీ’ : ఈ వారం రానున్న సినిమాలివే !

ఈ వారం ‘ఆచార్య’ రిలీజ్ ఉంది. పైగా ‘ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2’ వంటి భారీ సినిమాలు ఇంకా థియేటర్స్ లోనే ఉన్నాయి. అయినా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం రిలీజ్ లు ఆగడం లేదు. పలు చిన్న సినిమాలతో పాటు ఆల్ రెడీ థియేటర్లలో రిలీజైన పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి.

ఇక ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ సిరీస్ :

గంగూబాయి కథియావాడి(తెలుగు) ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

385 డేస్‌: ది డే(హాలీవుడ్‌) ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిషన్‌ ఇంపాజిబుల్‌ (తెలుగు) ఏప్రిల్‌ 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓ జార్క్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఊట్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ లు :

బేక్ట్‌ (హిందీ సిరీస్‌+) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద ఆఫర్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సిరీస్ :

నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ (హిందీ) ఏప్రిల్‌ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version