‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

ఈ వారం ఓటీటీ చిత్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి భారీ చిత్రాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. అయినా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం రిలీజ్ లు ఆగడం లేదు. పలు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి.

ఇక ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

జొంబ్లివీ (హిందీ చిత్రం) మే20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రేమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.

 

ఈ వారం డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్నసినిమా :

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించిన కొత్త సినిమా ‘భళా తందనాన’. శ్రీవిష్ణు సరసన కేథరిన్‌ హీరోయిన్ గా నటించింది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 20 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ అండ్ సినిమాలు :

ది ఇన్విజబుల్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌ మూవీ) మే16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద హంట్‌ (హాలీవుడ్‌ ) మే 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పూ కిల్డ్‌ సారా (వెబ్‌ సిరీస్‌ 3) మే 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం వూట్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

హనీమూన్‌ (కన్నడ) మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version