‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on May 9, 2022 3:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. పైగా ‘ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2’, ‘ఆచార్య’ వంటి భారీ సినిమాలు ఇంకా థియేటర్స్ లోనే ఉన్నాయి. అయినా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం రిలీజ్ లు ఆగడం లేదు. పలు చిన్న సినిమాలతో పాటు ఆల్ రెడీ థియేటర్లలో రిలీజైన పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఇక ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్ :

సేవేజ్‌ బ్యూటీ(వెబ్‌ సిరీస్‌) మే12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5లో ప్రసారం అవుతున్న సినిమాలు :

*తాలెదండ (కన్నడ) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ముగిలిపేట్‌ (కన్నడ) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రేమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ సిరీస్ :

ది మ్యాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ (తెలుగు డబ్బింగ్‌) మే12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మోడర్న్‌ లవ్‌ ముంబై (హిందీ సిరీస్రిమే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వుషు (మలయాళం) మే13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్నసినిమా :

స్నికరెల్లా (హాలీవుడ్‌ ) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఆహా లో ప్రసారం అవుతున్నసినిమా :

కుతుకు పత్తు (తమిళం) మే 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం వూట్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

ఆదా ఇష్క్‌(హిందీ సిరీస్‌) మే12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు