ఈ వారం ‘వెయ్ దరువెయ్, ‘రజాకార్’, ‘తంత్ర’, షరతులు వర్తిస్తాయి!, ‘లైన్‌మ్యాన్’, రవికుల రఘురామ, లంబసింగి, యోధ వంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జియో సినిమా :
హను-మాన్ (హిందీ) మార్చి 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
టూ కిల్ ఏ టైగర్ (హిందీ) మార్చి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
యంగ్ రాయల్స్ (హిందీ) మార్చి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
జీసస్ రెవల్యూషన్ (హిందీ) మార్చి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.
24 హవర్స్ విత్ గాస్పర్ (హాలీవుడ్) మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లాల్ సలామ్ (తమిళ) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మర్డర్ ముబారక్ (హిందీ) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ) మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
లవర్ (తమిళ చిత్రం) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సేవ్ ది టైగర్స్2 (తెలుగు సిరీస్) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
భ్రమయుగం (మలయాళం/తెలుగు) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే :
నో వే అప్ (తెలుగు వెర్షన్) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
మే అటల్ హూ (హిందీ) మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.