ఈ ఏప్రిల్ మూడో వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.
‘పారిజాత పర్వం’ :
సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘పారిజాత పర్వం’. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘శరపంజరం’ :
నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శరపంజరం’. ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్‌లలో విడుదల కాబోతుంది.
‘మారణాయుధం’ :
మాలాశ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రూపొందిన చిత్రం ‘మారణాయుధం’. ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.
పై మూడు సినిమాల పై ఎలాంటి అంచనాలు లేవు. కాబట్టి, ఈ వారం ఓటీటీలదే పై చేయి.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
ఎనీవన్ బట్ యూ (హాలీవుడ్) ఏప్రిల్ 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రెబల్ మూన్ 2 (హాలీవుడ్) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ :
చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సైరన్ (తెలుగు) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
మై డియర్ దొంగ (తెలుగు) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
డ్యూన్ (హాలీవుడ్) ఏప్రిల్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే :
డ్రీమ్ సినారియో (హాలీవుడ్) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద టూరిస్ట్ (వెబ్‌సిరీస్2) ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
పొన్ ఒండ్రు కేంద్రేన్ (తమిళ) ఏప్రిల్ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
ది సింపథైజర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది.
ఆర్టికల్ 370 (హిందీ) ఏప్రిల్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.