థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Jun 17, 2024 1:17 PM IST

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వారం ముందు వచ్చేందుకు పెద్ద సినిమాలేవీ సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో ‘నింద’, ఓఎమ్‌జీ, ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అవుట్‌ స్టాండింగ్‌ (హాలీవుడ్) జూన్‌ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నడిగర్‌ (మలయాళం) జూన్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రిగర్‌ వార్నింగ్‌ (హాలీవుడ్‌) జూన్‌21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

బ్యాడ్‌కాప్‌ (హిందీ) జూన్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

ది హోల్డోవర్స్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 (వెబ్‌సిరీస్) జూన్‌ 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇండస్ట్రీ (వెబ్‌సిరీస్) జూన్‌ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బిగ్‌బాస్‌ ఓటీటీ 3 (రియాల్టీ షో ) జూన్‌21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు