వేసవి ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. పైగా ఈసారి అటు తెలుగు సంవత్సరాది, ఇటు రంజాన్ వరుసగా రావడంతో బాక్సాఫీస్ కళకళలాడేందుకు సిద్ధమైంది. ఇక ఈ వారం ‘ఎల్ 2: ఎంపురాన్’, విక్రమ్ ‘వీర ధీర శూర’, ‘రాబిన్‌హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
ది ఎక్స్‌టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.