సర్దార్2 పై అధికారిక ప్రకటన…త్వరలో షూటింగ్ షురూ!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ వరుస హిట్ చిత్రాలతో దూసుకు పోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన సర్దార్ చిత్రం మంచి రివ్యూ లతో, పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. బాక్సాఫీస్ వద్ద సైతం ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ స్పై డ్రామా కి సంబంధించిన సీక్వెల్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

సర్దార్ 2 పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రం లో కార్తీ సర్దార్ గా నటించగా, అతని కొడుకు కూడా రా ఏజెంట్ గా చేయనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version