“పుష్ప 2” లో లేడీ పవర్ స్టార్ నుంచి లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 30, 2023 10:03 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రేష్మకా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న మాసివ్ బడ్జెట్ సీక్వెల్ సినిమా “పుష్ప ది రూల్” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయ్యి మరింత హైప్ ని సెట్ చేసుకుంది.

అయితే గత కొన్ని రోజులు కితం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా సినిమాలో కీలక పాత్ర చేస్తుంది అని కొన్ని రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారగా ఇపుడు దీనిపై అసలు క్లారిటీ బయటకి వచ్చింది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో అయితే సాయి పల్లవి ఈ సినిమాలో నటించట్లేదు అని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అలాగే ఆ సినిమాలో ఉన్నానని అన్నందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను అని కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అయితే ఆమె క్లారిటీ ఇచ్చింది. సో పుష్ప 2 లో అయితే లేడీ పవర్ స్టార్ లేనట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :