రాజకీయ నాయకురాలిగా ‘వరలక్ష్మి’ ?

Published on Mar 7, 2021 3:00 am IST

‘క్రాక్‌’, ‘నాంది’ చిత్రాలతో ‘వరలక్ష్మి శరత్ కుమార్’ వరుస హిట్స్ అందుకుంది. ఇప్పుడు ఆమెకు తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో రానున్న సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్ర దక్కిందట. ఈ సినిమాలో ఆమె పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా కనిపించే అవకాశాలున్నట్లు టాక్‌ నడుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం :