Vettaiyan: వేట్టైయాన్ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్ దసరా కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి నేడు వరుస అప్డేట్స్ వస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ‘నటరాజ్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో మనకు ఈ సినిమాలో కనిపించనున్నాడు. అటు మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో పాట్రిక్ అనే పాత్రలో నటిస్తున్నాడు. వీరి పాత్రలకు సంబంధించిన ఇంట్రోని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ కూడా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా రెండో సింగిల్ సాంగ్ ‘హంటర్ వంటార్’ను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వీడియో రూపంలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ దుమ్ములేపుతోంది. వేట్టైయాన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version