“యూఐ” క్లైమాక్స్ పై ఆసక్తి రేపుతున్న ఉపేంద్ర క్రేజీ పోస్ట్..

వినూత్న చిత్రాలు తెరకెక్కించడంలో కన్నడ నటుడు అలాగే దర్శకుడు రియల్ స్టార్ ఉపేంద్ర ఒక దశాబ్దం ముందే ఉంటారు అని చెప్పాలి. తను తెరకెక్కించిన పలు చిత్రాలు ఇప్పటికీ అలరిస్తాయి. అలా తను చేసిన సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించగా చాలా కాలం తర్వాత తన నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే “యూఐ”.

మళ్లీ తన మార్క్ వినూత్నమైన కాన్సెప్ట్ అండ్ టేకింగ్ తో అలాగే క్రేజీ ప్రమోషన్స్ తో కన్నడ సహా తెలుగులో కూడా మంచి బజ్ తో నేడు ఈ సినిమా రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఉపేంద్ర వేసిన పోస్ట్ ఇపుడు ఆసక్తి రేపుతోంది.

తను ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను అని మెయిన్ గా ఆ క్లైమాక్స్ ని ఎలా డీకోడ్ చేస్తారో చూడాలి. అది డీకోడ్ చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి అనుకుంటున్నాను అంటూ ఈ క్రేజీ సినిమా క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మరి నిజంగానే క్లైమాక్స్ ఆ రేంజ్ లో ఉంటుందేమో చూడాలి.

Exit mobile version