ఇంటర్వ్యూ: స్టార్ హీరో ఉపేంద్ర – UI మూవీ ఆడియన్స్‌కి మరిచిపోలేని అనుభూతినిస్తుంది!

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా UI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో ఈ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘UI’ కాన్సెప్ట్, ఐడియా ఎలా మొదలైంది?
యు అండ్ ఐ… మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది. నేను ఆలోచిస్తున్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారా? క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి. నేను ఫీల్ అవుతున్నదే మీరూ ఫీల్ చేస్తున్నారు. ఇది ఆడియన్స్ తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు. ఈ సినిమాని మెటాఫరికల్ చేశాం.

అమీర్ ఖాన్ ని కూడా మీ సినిమా కదిలించింది కదా?
అమీర్ ఖాన్ గారు చాలా బిగ్ స్టార్. ఆయనకి మా సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది. అదంతా ఆయన గొప్పతనం. ఆయన సినిమా గురించి మాట్లాడారు. అది మాకు చాలా హెల్ప్ అయింది.

మీ సినిమాల్లో ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి కథలు చెప్పాలనే ధైర్యం మీకు ఎలా వచ్చింది?
ఏమో నాకే తెలియదండి. నాకు చెప్పాలనిపించింది సినిమా ద్వారా చెప్పేస్తాను. ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక పూల్ వెళ్తాడని సామెత ఉంది. బహుశా ఆ గట్ ఫీలింగ్ తో వెళ్తున్నానేమో. ఇదంతా ఆడియన్స్ గొప్పతనం గానే భావిస్తాను నా సినిమాలన్నింటి గురించి చాలా చక్కగా డీకోడ్ చేసి అంతాలా గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది.

మీ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. లుక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నిజానికి లుక్ విషయంలో ఇందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏడాది స్క్రిప్ట్ కి పడితే మరో ఏడాది లుక్, క్యారెక్టర్ డిజైన్ కే పడుతుంది.

సినిమా రన్ టైం గురించి?
టు అవర్స్ టెన్ మినిట్స్ ఉంటుంది. నాకు ఏదైనా విషయాన్ని లాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు. సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణం?
అల్లు అర్జున్ నా ఫేవరెట్ యాక్టర్. నేను ఆయనకి ఫ్యాన్ ని. అలాగే త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. ఆ ఇద్దరు కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కథలు వచ్చాయి. అయితే నా మూవీ వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు.

మీ సినిమాలకి సీక్వెల్స్ చేసే ఆలోచన ఉందా?
లేదండి. నా కథలకు పార్ట్ 2 చేసే ఆలోచన నాకు రాదు. ఇంకా ఏమైనా కొత్త కథలు చెప్పాలని ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ దీనికి రెండో పార్ట్ కూడా చేయాలని అంటే అప్పుడు ఆలోచిస్తాను (నవ్వుతూ)

మీ కథల్లో బాధ పెట్టే వాళ్ళ కంటే బాధపడే వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు? దాని గురించి చెప్పండి?
మీరన్నది కరెక్టే. మనం ఎక్కువగా ప్రాబ్లం గురించే మాట్లాడుతాం. సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఈ విషయంలో కొంచెం ట్రై చేస్తాను. సొల్యూషన్ ఇక్కడే ఉంది దాని గురించి ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది జాలీగా సినిమా చూసి వెళ్లిపోతారు.

మీ సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉంటాయి కదా.. సెన్సార్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు?
ఓం’ సినిమాకి చాలా ప్రాబ్లం అయింది. తర్వాత నా ‘ఏ’ సినిమా చూసి థిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఫిట్ ఫర్ రిలీజ్ అని వెళ్ళిపోయారు. తర్వాత రివైజ్ కమిటీలో ఎక్స్ట్రాడినరీగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. నా కథలు, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. బహుశా అందుకే అలా రియాక్ట్ అయి ఉంటారని భావించాను. ఈ సినిమా వరకు ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చారు.

ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే సినిమాలు తీయాలనేది మీ ఉద్దేశమా?
లేదండి. సినిమా అనేది ఎప్పుడూ కూడా ఎంటర్టైన్మెంట్ మీడియా. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వస్తారు. ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. ఈ సినిమాలో కూడా సాంగ్స్ ఫైట్స్ మంచి మ్యూజిక్ విజువల్ గ్రాండియర్ అన్ని ఉన్నాయి. నార్మల్ గా చూసినప్పుడు ఒక మంచి సినిమా లాగా ఉంటుంది. కొంచెం డీప్ గా వెళ్తే ఇంకొక లేయర్ కనిపిస్తుంది. ఇంకా డెప్త్ లో చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే ఫిలాసఫికల్ యాంగిల్ కనిపిస్తుంది. అన్ని ట్రై చేశాను. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Exit mobile version