అదరగొడుతున్న ఉపేంద్ర “యూఐ”.. డే 3 సాలిడ్ బుకింగ్స్

తన మార్క్ విలక్షణ మరియు వైవిధ్య కాన్సెప్ట్ లతో అలరించే నటుడు దర్శకుడు ఉపేంద్ర నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమానే “యూఐ”. మరి ఓ క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ సహా తెలుగులో అదరగొడుతుంది అని చెప్పాలి. మొదటి రోజు నుంచే మంచు బుకింగ్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు మూడో రోజుకి వచ్చేసరికి మంచి హోల్డ్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి.

డే 1 కంటే డే 2 బుకింగ్స్ ఎక్కువగా నమోదు కాగా ఇపుడు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ బుకింగ్స్ ని నమోదు చేసి ఈ సినిమా అదరగొడుతుంది. దీనితో మూడు రోజుల్లో యూఐ సినిమా సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించింది అని చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే మళ్ళీ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో ఉపేంద్ర గట్టి కం బ్యాక్ కొట్టారు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా లహరి ఫిల్మ్స్ వారు జీ స్టూడియోస్ కలయికలో నిర్మాణం వహించారు.

Exit mobile version