కన్నడ రియల్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ చిత్రం “యూఐ” కోసం అందరికీ తెలిసిందే. మరి తన నటనతోనే కాకుండా అడ్వాన్స్డ్ విజన్ తో కూడిన సినిమాలు కూడా చేసి ఎప్పుడు నుంచో కన్నడ సినిమాలోనే కాకుండా తెలుగు ఆడియెన్స్ లో తన మార్క్ ముద్రని తాను వేసేసారు. దీనితో తన సినిమాలకి మన దగ్గర కూడా మంచి క్రేజ్ ఉండగా తన దర్శకత్వంలో కూడా చాన్నాళ్ల నుంచి సినిమాలు మిస్ మళ్ళీ తన నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ గా వచ్చిన చిత్రమే ఈ “యూఐ”.
మరి దీనికి కన్నడతో పాటుగా తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుండగా ఇపుడు బుకింగ్స్ లో సాలిడ్ రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం 2 లక్షల 50 వేలకి పైగా టికెట్స్ తెగి ర్యాంపేజ్ చూపిస్తుంది. దీనితో ఆడియెన్స్ లో యూఐ కోసం ఎదురు చూసే వాళ్ళు చాల మందే ఉన్నారని చెప్పాలి. మరి ఈ స్టడీ బుకింగ్స్ ముందు కూడా సాగుతాయో లేదో చూడాలి.