కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు అధికారికంగా గీతా ఫిలిం వారు అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దీంతో ‘యూఐ’ చిత్రాన్ని తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాను ఉపేంద్ర స్వయంగా డైరెక్ట్ కూడా చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.