“ఉప్పెన” టీజర్ కు టైం లాక్ చేసేసిన టీం.!

Published on Jan 13, 2021 9:05 am IST

యంగ్ అండ్ మెగా హీరో వైష్ణవ్ డెబ్యూ చిత్రంగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “ఉప్పెన”. తన మొదటి సినిమాతోనే మంచి అంచనాలను తెచ్చుకోగలిగాడు వైష్ణవ్. కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కు గనుఁ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో బిగ్ ఎస్సెట్ అయ్యింది.దీనితో ఈ చిత్రం లేట్ అయ్యినప్పటికీ మంచి హైప్ అయితే అలాగే ఉంది.

మరి ఈ మ్మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి టీజర్ వస్తుంది అని మేకర్స్ నిన్ననే ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా ఇప్పుడు టైం ను కూడా లాక్ చేసేసారు. ఈ టీజర్ ను ఈరోజే భోగి పండుగ మరియు తమ హీరో వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More