సమీక్ష : ఉరుకు పటేల – సిల్లీ ప్లేతో సాగే బోరింగ్ థ్రిల్ల‌ర్ !

Uruku Patela Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 07, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: తేజస్ కంచర్ల, ఖుష్బూ చౌదరి, గోపరాజు రమణ, సుదర్శన్, లావణ్య రెడ్డి, చమ్మక్ చంద్ర, జై చంద్ర తదితరులు.

దర్శకుడు: వివేక్ రెడ్డి

నిర్మాత : కె బాల భాను

సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: స‌న్నీ కూర‌పాటి

ఎడిట‌ర్ : శశాంక్ ఉప్పుటూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

తేజ‌స్ కంచ‌ర్ల‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. కాగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

తెలంగాణలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. చదువు లేని పటేల (తేజ‌స్ కంచ‌ర్ల‌) ఊరిలో బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడతాడు. ఐతే, అతన్ని అందరూ ఛీ కొట్టాక… వైద్యురాలు అక్షర (ఖుష్బూ చౌదరి) మాత్రం పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తుంది. అంతగా చదువుకున్న అక్షర, పటేల ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ?, అసలు పటేలకి ‘ఉరుకు పటేలా’ అనే పరిస్థితి ఎందుకు వస్తోంది ?, ఈ మధ్యలో పటేలా తండ్రి, ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) పాత్ర ఏమిటి ?
ఇంతకీ, పటేలకు ఎదురైన చావు రేవు పరిస్థితి నుంచి అతను ఎలా బయట పడ్డాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ఉరుకు పటేలా సినిమాకి ప్లస్ పాయింట్ హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌ మాత్రమే. తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ లో తేజ‌స్ చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా తేజ‌స్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ ఖుష్బూ చౌదరి తన నటనతో అలరించింది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన గోపరాజు రమణ నటన చాలా బాగుంది. సుదర్శన్, లావణ్య రెడ్డి, లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ఉరుకు పటేల సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగాలి. కానీ, ఈ సినిమా ఏ దశలోనూ అలా సాగలేదు. దీనికితోడు చాలా సన్నివేశాలు చాలా పేలవంగా సాగుతాయి.

పైగా ఆ సన్నివేశాల్లో లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి.

ఐతే, దర్శకుడు వివేక్ రెడ్డి సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు. పైగా సినిమాలో సిల్లీ ట్రాక్స్ కూడా మైనస్ అయ్యాయి. ప్రధాన పాత్రల డిజైన్ కూడా అసలేమీ బాగాలేదు. మొత్తానికి ఈ సినిమా బాగా నిరాశ పరిచింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా బాగాలేదు. కాకపోతే, ప్రవీణ్ లక్కరాజు సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగాలేదు. ఐతే కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం పర్వాలేదు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత కె బాల భాను పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఏవరేజ్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు వివేక్ రెడ్డి ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

తీర్పు :

‘ఉరుకు పటేల’ అంటూ వచ్చిన ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, కథలో మేటర్ లేకపోవడం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలతో పాటు లాజిక్ లెస్ డ్రామా కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ చిత్రం ఏ కోణంలోనూ ఆకట్టుకోదు.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version