విడుదల తేదీ : ఆగస్టు 02, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య శ్రీనివాస్, రవి శివతేజ, శివాజీ రాజా, ఆమని, అలీ తదితరులు
దర్శకులు: కె.విజయ భాస్కర్
నిర్మాతలు : విజయ భాస్కర్
సంగీత దర్శకుడు: ఆర్ఆర్ ధృవణ్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎంఆర్ వర్మ
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాల దర్శకుడు కె.విజయ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం ఉషాపరిణయం. ఆయన నుంచి వస్తున్న ఈ ప్యూర్ రొమాంటిక్ సినమా టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
దుబాయ్ లో ఓ కోర్స్ నేర్చుకునేందుకు వెళ్లిన హనీ(శ్రీకమల్) అక్కడ ఆనంద్(సూర్య శ్రీనివాస్)ను కలుస్తాడు. అతడికి తన గతం గురించి చెబుతాడు హనీ. ఓ పెళ్లిచూపుల్లో ఉషా అనే అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు హనీ. అయితే, అతడు జాయిన్ అయిన ఫ్యాషన్ కంపెనీలో ఉషా కూడా పనిచేస్తుంటుంది. ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు హనీ. ఆమెను ఇంప్రెస్ చేయాలని దుబాయ్ నుంచి తిరిగొచ్చిన హనీకి ఓ షాక్ తగులుతుంది. ఉషాకి వేరొకరితో నిశ్చితార్థం అయిపోతుంది. ఇంతకీ ఉషాకి హనీ తన ప్రేమను తెలిపాడా లేదా..? ఉషా పెళ్లి జరుగుతుందా..? ఇంతకీ ఈ ఆనంద్ ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఉషాపరిణయం సినిమా కథ రొటీన్ అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. హీరోగా శ్రీకమల్ చక్కటి నటనను కనబరిచాడు. కథలోని ఎంటర్టైనింగ్ అంశాలు అలరిస్తాయి. ఫస్ట్ హాప్ చాలా జోవియల్ గా సాగడం సినిమాకు మంచి అసెట్. లవ్ స్టోరీని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.
ఈ సినిమాలోని సంగీతం వినసొంపుగా ఉంది. విజయ భాస్కర్ చిత్రాల్లో ఎలాంటి పాటలు ఎక్స్ పెక్ట్ చేస్తామో అవి ఇందులో కనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ కూడా చక్కగా కుదిరాయి. అలీ చేసే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి.
సెకండ్ హాఫ్ లోని పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకునేలా మలిచారు. క్లీన్ అండ్ రొమాంటిక్ సినిమాకు కావాల్సిన చాలా అంశాలు ఉషా పరిణయం చిత్రంలో కనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు రొటీన్ లవ్ స్టోరీ కథ మైనస్ అని చెప్పాలి. ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ కథ మనకు గతంలోని చాలా సినిమాలను గుర్తుకు చేస్తుంది. ఇక కొన్ని సీన్స్ లో ఈ కథ ట్రాక్ తప్పినట్లుగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వన్ సైడ్ లవ్ లో భాగంగా హీరో చేసే కొన్ని సీన్స్ బోరింగ్ అనిపిస్తాయి.
హీరోయిన్ పాత్రలో మంచి నటనకు స్కోప్ ఉంది. కానీ, కొత్త హీరోయిన్ కావడంతో ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోతాయి. ఫస్ట్ హాఫ్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన కథ, సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పుతుంది. ఎంటర్టైన్మెంట్ కోసం వెన్నెల కిషోర్ పాత్రను తీసుకున్నప్పటికీ, దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఆనంద్ పాత్ర కూడా కేవలం స్క్రీన్ ప్రిజెన్స్ కోసమే ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఎమోషనల్ సీన్స్ ను హీరో ఇంకాస్త బాగా క్యారీ చేసి ఉండాల్సింది. ఇక క్లైమాక్స్ లో మంచి ఉత్కంఠను క్రియేట్ చేసే అవకాశం ఉన్నా, దానిని పూర్తిగా వినియోగించుకోలేదు. సినిమాలోని సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
ఫ్యామిలీ, లవ్ కథల చిత్రాల దర్శకుడిగా కె.విజయ భాస్కర్ తనకున్న క్రెడిబిలిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. రొటీన్ కథను కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇలాంటి కథకు చక్కటి సంగీతం అవసరం. ఈ విషయంలో సంగీత దర్శకుడు ఆర్ఆర్.ధృవణ్ పూర్తి మార్కులు సాధించాడు. ఆకట్టుకునే పాటలతో పాటు చక్కటి బీజీఎం ఈ సినిమాకు అందించాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. అయితే ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
ఓవరాల్ గా ఉషాపరిణయం సినిమా ఓ రొటీన్ ఎంటర్టైనర్ గా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. దర్శకుడు విజయ భాస్కర్ ఎదురుచూస్తున్న కమ్ బ్యాక్ సక్సెస్ మళ్ళీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ సినిమాలోని రొటీన్ కథ, కొత్తదనం కోరే వారికి నచ్చదు. మొత్తంగా ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో ఫెయిల్ అయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team