ఓటిటి సమీక్ష: ‘ఉత్తరం’ – లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘ఉత్తరం’ – లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

Published on Apr 9, 2025 6:58 PM IST

kaafir Movie Review In Telugu

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 6, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : తులసి, బాలాదిత్య, పూజిత పొన్నాడ, నిహారిక సతీష్, రమ్య పొందూరి తదితరులు.
దర్శకత్వం : వేగేశ్న సతీష్
నిర్మాణం : వేగేశ్న సతీష్
సంగీతం : ఎస్ కె బాల చంద్రన్
సినిమాటోగ్రఫీ : దాము నర్రావుల
ఎడిటర్ : మధు
సంబంధిత లింక్స్ :ట్రైలర్ 

టాలీవుడ్ హిట్ చిత్రం శతమానం భవతి దర్శకుడు వేగేశ్న సతీష్ తెరకెక్కించిన తాజా లఘు చిత్రం “ఉత్తరం”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ కథా సుధ వీక్లీ సిరీస్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ 30 నిమిషాల సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కొత్తగా పెళ్ళైన భార్యా భర్తలు (బాలాదిత్య, పూజిత పొన్నాడ) ఆషాడం మూలాన దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలా సిటీలో బాలాదిత్య తన అమ్మగారి ఇంట్లో చిన్ని (పూజిత) ఉంటారు. అయితే ప్రస్తుత జెనరేషన్ కి చెందిన చిన్ని తన నానమ్మ (తులసి)తో జరిగిన కొన్ని సన్నివేశాలతో తులసి జీవితంలో ఉత్తరాలు కోసం తెలుసుకుంటుంది. అలా తులసి జెనరేషన్ లో ఒకరితో ఒకరు సంభాషణలు ఎలా ఉండేవి? అప్పటికి ఇప్పటికి మనుషుల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఏర్పడ్డాయి? ఈ ఉత్తరం లఘు చిత్రంతో ఎలాంటి సందేశం ప్రస్తుత తరానికి ఇచ్చారు అనేది తెలియాలి అంటే ఈటీవీ విన్ లో చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ప్రస్తుత జెనరేషన్ తెలుగు ఆడియెన్స్ కి మర్చిపోతున్న విలువలని శతమానం భవతి సినిమాతో తట్టి లేపి చూపించిన దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి ఈ ఉత్తరం అనేది కూడా మరో మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు.

ఇప్పుడు జెనరేషన్ లో మనుషులు మధ్య దూరం పెరిగి టెక్నాలజీతో మాట్లాడుకుంటున్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న తారతమ్యాన్ని చాలా అందంగా అర్ధవంతంగా చూపించిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా తన మార్క్ డైలాగులు ఈ చిత్రంలో ఆకట్టుకుంటాయి.

తులసికి తన భర్త పంపిన ఉత్తరంలో మాటలు కానీ ముగింపు వ్యాఖ్యలు కానీ ఆడియెన్స్ కి హత్తుకునేలా అనిపిస్తాయి. ఉత్తరాలలో ఉండే ఎమోషన్ ఇపుడు ఆన్లైన్ మెసేజెస్ లో ఉండవు అనే పాయింట్ నిజమే కదా అనిపిస్తుంది.

అలాగే తులసీ, పూజిత పొన్నాడ నడుమ మొదట్లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అలాగే వారి నటన కూడా ఇందులో బాగుంది. బాలాదిత్య తన పాత్రని అలవోకగా చేసేసాడు. మిగతా నటీనటుల నటన కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్:

సతీష్ వేగేశ్న ప్రస్తుత తరానికి ఉత్తరం తాలూకా ఎమోషన్ ని అందంగా చూపించే ప్రయత్నంలో కొంచెం రొటీన్ కథనం చూపించారని చెప్పక తప్పదు. శతమానం భవతిలో షేడ్స్ కొన్ని సన్నివేశాలు ఇందులో రొటీన్ గానే అనిపిస్తాయి.

అలాగే వింటేజ్ సన్నివేశాల్లో విలువలు, సాంప్రదాయాలు, పరిస్థితులని బాగా చూపించారు కానీ పెద్దలు చెప్పినట్టుగా అన్నం తినేటప్పుడు అన్నం దగ్గరకి మనం వెళ్ళాలి కానీ మన దగ్గరకి చేతిలో ముద్ద నోటి దగ్గరకి తెచ్చుకోకూడదు అనేది మిస్ చేశారు.

పూజితపై ఈ సన్నివేశం అంత నీట్ కథనంలో చిన్నగా కరుక్కుమంటుంది. అలాగే నిడివి కేవలం 30 నిమిషాలే అయినప్పటికీ కొన్ని సందర్భాలలో సోసో గానే అనిపిస్తాయి. అలాగే పూజితపై అంత గ్లామరస్ సన్నివేశం అవసరం లేదు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సాంకేతిక వర్గం పనితీరు బాగుంది. సంగీతం, ముఖ్యంగా ఛాయా గ్రహణం ఇంపుగా ఉంది. అందమైన సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. పైన చెప్పినట్టు గానే దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి ఇది మరో అందమైన ప్రయత్నమే కానీ చిన్న లోటు పాట్లు ఉన్నాయి. ఇవి తప్పితే ప్రస్తుత తరానికి తాను అందమైన లఘు చిత్రం అందించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఉత్తరం’ అనే లఘు చిత్రంలో నటీనటుల పనితీరు బాగుంది. అలాగే మేకర్స్ ప్రయత్నం అనేది హర్షణీయం. కాల క్రమేణా మర్చిపోతున్న కొన్ని పాత జ్ఞాపకాలని మళ్ళీ చూపించడం అనేది ఇలాంటి తరహా సినిమాలని కొన్ని చోట్ల రొటీన్ గా ఉన్నా ఇష్టపడే వారికి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలాగే ప్రస్తుత తరం వారు కూడా ఈ చిత్రాన్ని చూస్తే తమకి కూడా ఒక అందమైన కొత్త విషయం తెలుసుకున్నట్టు కూడా అవుతుంది. సో ఈటీవీ విన్ లో ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు