“చెన్నకేశవ రెడ్డి”లో ట్రెండ్ సెట్టింగ్ సీన్ వెనకున్న కష్టం.!

Published on Oct 21, 2020 12:03 am IST


మన టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మన దక్షిణాది సినిమాలోనే కొన్ని ఐకానిక్ యాక్షన్ సీన్స్ అనే జాబితా తీస్తే యూనానిమస్ గా నిలిచే సీన్ మాత్రం నందమూరి నటసింహం నటించిన చెన్నకేశవ రెడ్డి లోని భూమిలో నుంచి ఆరు సుమోలు గాల్లో లేచే సీన్ అని చెప్పాలి.

ఫ్యాక్షన్ సినిమాలు టాలీవుడ్ ను ఏలుతున్న ఆ సమయంలో దర్శకుడు వివి వినాయక్ డిజైన్ ఈ సీన్ కోసం ఇప్పటి ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ లో ఈ ఎక్స్ట్రార్డినరీ సన్నివేశం ట్రెండ్ సెట్ చేసింది.అయితే అలాంటి ఈ సంచలన సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో దర్శకుడు వినాయక్ ఈటీవీలో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” షో ద్వారా తెలిపారు.

ఇప్పుడంటే అంతా గ్రాఫిక్స్ వచ్చాయి కానీ ఆ సమయంలో ఆ చిత్రంలో అయితే ప్రతీ షాట్ ఒరిజినల్ గా తీసిందే అని ఆ సుమోల సీన్ కు అయితే నాలుగైదు కెమెరాలు, మొత్తం నాలుగు హెలికాఫ్టర్లతో రెండు రోజుల్లో ఏదో తెలియని కసితో చేశామని అంతే కాకుండా భూమి లోపలకు చాలా వరకు తవ్వేసి అందులో సుమోలను ఉంచి మెకానిజమ్ అంతా సెట్ చేసి గ్యాసెస్ తో కృష్ణ అనే టెక్నిషియన్ తో ప్లాన్ చేశామని.

అలాగే ఆ టైంలో ఎలాంటి వాకీలు కూడా లేకపోవడంతో ఒక్కరి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పాల్సి వచ్చేది అని తెలిపారు. తాను అంతకు ముందు చేసిన “ఆది”కు ఎంత గుర్తింపు వచ్చిందో దాని తర్వాత చేసిన “చెన్నకేశవ రెడ్డి”కి వచ్చిన ఫలితంతో సంబంధం లేకుండా కేవలం ఈ షాట్స్ చూసి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయని వినాయక్ చెప్పారు. ప్రస్తుతం వివి వినాయక్ మెగాస్టార్ చిరంజీవితో “లూసిఫర్” రీమేక్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More