ఆ తెలుగు హీరోను బాలీవుడ్లోకి ప్రవేశపెట్టబోయేది ‘వినాయక్’యేనా ?

Published on Nov 26, 2020 11:11 pm IST


యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సంగతి తెలిసిందే. హిందీలోకి మంచి యాక్షన్ కథతో దిగాలనుకుంటున్న బెల్లంకొండ అందుకు ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని చూజ్ చేసుకున్నారు. ఈ సినిమానే అక్కడ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ లాంఛ్ కోసం తెలుగు దర్శకులనే ఎంచుకోవాలని అనుకుంటున్నారు. మొదటగా ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారనే టాక్ వినబడగా ప్రాజెక్ట్ చేయట్లేదని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో దర్శకుడు ఎవరనే క్వశ్చన్ మార్క్ ఏర్పడింది.

ఈ ప్రశ్నకు సమాధానంగా వి.వి.వినాయక్ పేరు వినబడుతోంది. మాస్ ఎంటర్టైనర్లు తీయడంలో వినాయక్ సిద్దహస్తుడు. శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’తో తెలుగులోకి పరిచయం చేసింది వినాయకే. ఆ చిత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది కూడ. అందుకే వినాయక్ ద్వారానే హిందీలోకి కూడ బెల్లంకొండ లాంఛ్ అవ్వాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు వినాయక్ చిరుతో చేయవలసిన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు.

సంబంధిత సమాచారం :

More