సెన్సార్ పూర్తిచేసుకున్న ‘వారధి’

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘వారధి’

Published on Dec 11, 2024 6:20 PM IST

Vaaradhi

అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో, రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను అందించారు

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, “ఈ కథ లో లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు