ఓటిటి సమీక్ష : “వధువు” – తెలుగు సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో

Vadhuvu Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అవికా గోర్, నందు, అలీ రెజా, వి ఎస్ రూప లక్ష్మి, మౌనిక తదితరులు.

దర్శకుడు : పోలూరు కృష్ణ

నిర్మాతలు: శ్రీకాంత్ మోహతా & మహేంద్ర సోని

సంగీతం: శ్రీరామ్ మద్దూరి

సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేష్

ఎడిటర్: అనిల్ కుమార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ మరియు ఓటిటి లలో వచ్చిన చిత్రాలు సిరీస్ లలో స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన తెలుగు సిరీస్ “వధువు” కూడా ఒకటి. యంగ్ హీరోయిన్ అవికా గోర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే అప్పటికే ఒక పెళ్లి ఆగిపోయి తన రెండో పెళ్ళికి సిద్ధమవుతుంది ఇందు(అవికా గోర్). ఈసారి తన పెళ్లి ఎలాంటి ఆటకం లేకుండా జరగాలని ఆమె కోరుకుంటుంది. కానీ పెళ్లి అయితే జరుగుతుంది కానీ ఆమె పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. తన భర్త ఆనంద్(నందు) అలాగే తన మరిది ఆర్య(అలీ రెజా) అలాగే తన మెట్టెనింట్లో అందరి వెనుక ఒకో రహస్యం దాగి ఉంటుంది. అలాగే వీరి అందరికీ కనెక్షన్ గా ఆర్య భార్య వైష్ణవి కథ మరింత సస్పెన్స్ గా ఉంటుంది. మరి వీరి అందరి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? ఆ వైష్ణవికి ఏమవుతుంది? ఈ రహస్యాలను ఇందు కనుక్కుంటుందా అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ లో కనిపించిన అవికా అయితే మంచి పెర్ఫామెన్స్ ని అందించింది అని చెప్పాలి. ఆమె తన లుక్స్ తో కూడా ఆకట్టుకోగా ఓ సీరియస్ రోల్ లో అయితే ఆమె తన రోల్ లో డెప్త్ ని చివర వరకు మైంటైన్ చేసింది.

అలాగే నటుడు అలీ రెజా ఈ సిరీస్ లో మంచి పాత్రలో కనిపించాడు. తన రోల్ లోని షేడ్స్ ని తాను బాగా పండించాడు. అలాగే నందు కూడా ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే అవికా అత్తయ్య పాత్రలో కనిపించిన సహా ఇతర తదితర నటీనటులు మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచారు.

తెలుగు నుంచి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకునేవారికి “వధువు” డీసెంట్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పొచ్చు. సిరీస్ లో నరేషన్ అంతకంతకు అయితే ఆసక్తిగా సాగుతుంది. కథనం అనుసరించి వచ్చే ట్విస్ట్ లు అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఒకో ఎపిసోడ్ తర్వాత మరో ఎపిసోడ్ కి సస్పెన్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్లడం కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా ఇదే తరహాలో ఎపిసోడ్స్ మారుతున్న కొద్దీ సిరీస్ లో వాతావరణంకి తగ్గట్టుగా వినిపించే స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో మొదటి ఎపిసోడ్ మాత్రం మిగతా ఎపిసోడ్స్ తో పోలిస్తే అంత ఎంగేజింగ్ గా ఉండదు. అవ్వడానికి తక్కువ నిడివి ఉన్న ఎపిసోడ్స్ అయినప్పటికీ మొదటి ఎపిసోడ్ ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

అలాగే టోటల్ సిరీస్ చాలా చిన్నదే కానీ దానిని కూడా ఎక్కువ ఎపిసోడ్స్ గా ఎందుకు మార్చారో అర్ధం కాలేదు. కొంచెం తక్కువ ఎపిసోడ్స్ లానే ప్లాన్ చేయాల్సింది. అలాగే అవికా గోర్ రోల్ ని మరికాస్త సెటిల్డ్ గా డిజైన్ చేయాల్సింది.

పెళ్ళై వెళ్లిన ఇంట్లో వారికి చిన్న మాట కూడా చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా చేయడం అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే ఫైనల్ ఎపిసోడ్ క్లైమాక్స్ ని ఇంకాస్త బెటర్ గా మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చి ముగించి ఉంటే ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ గా అనిపించేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే టెక్నీకల్ టీం లో అయితే మ్యూజిక్ వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ తర్వాత బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు పోలూరు కృష్ణ విషయానికి వస్తే..తాను ఒరిజినల్ సిరీస్ “ఇందు” కి రీమేక్ గా దీనిని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ ఆ క్లైమాక్స్ ఎండింగ్ మినహా తన వర్క్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు. థ్రిల్లింగ్ గా మంచి ఎంగేజింగ్ నరేషన్ ని తాను అందించే ప్రయత్నం చేసాడు.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “వధువు” లో అవికా గోర్ సహా ఇతర ముఖ్య నటులు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే సిరీస్ లో సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్ అలాగే ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి. కాకపోతే ఒక్క ఫస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఎండింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. వీటితో అయితే ఈ వీకెండ్ కి “వధువు” ని ఒకసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version