ఏ హీరోకైనా మొదటి సినిమా రిలీజ్ అయ్యాకే రెండు సినిమా ఆఫర్లు వస్తుంటాయి. డెబ్యూ చిత్రంలో అతని పెర్ఫార్మెన్స్, క్వాలిటీస్ చూశాకే అతను ఎలాంటి కథలకు సరిపోతాడు అనే అంచనా వస్తుంది దర్శకులకు, రచయితలకు. కానీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినారియో మాత్రం పూర్తిగా భిన్నం. ఇంకా మొదటి సినిమానే విడుదలకాలేదు అప్పుడే ఆయనకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. ఆయన ఫస్ట్ పిక్చర్ ‘ఉప్పెన’. అన్ని పనులు పూర్తైన ఈ సినిమా విడుదల లాక్ డౌన్ వలన వాయిదాపడింది. థియేటర్లు పూర్తిగా రీఓపెన్ అయిన తర్వాత విడుదలవుతుంది.
అయితే ఈలోపే ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేయడం, షూటింగ్ ముగించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇంతలోనే తేజ్ కు మరొక రెండు సినిమా ఆఫర్లు వచ్చాయట. వాటిలో ఒక సినిమాను దాదాపుగా ఓకే చేసేశారని ఇంకో సినిమా చర్చల దశలో ఉందని ఫిల్మ్ నగర్ టాక్. డెబ్యూ సినిమానే విడుదలకాకుండా ఇలా వరుస పెట్టి ఆఫర్లు అందుకోవడం అంటే విశేషమనే అనాలి. ఇప్పుడే ఆయనకు డిమాండ్ ఇలా ఉందంటే రేపు చేసిన రెండు సినిమాలు హిట్టైతే ఇంకెంత బిజీ అయిపోతారో మరి.