బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. బేబీ ప్లాన్ తేడా కొట్టిందిగా!

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. బేబీ ప్లాన్ తేడా కొట్టిందిగా!

Published on Apr 13, 2025 2:00 AM IST

టాలీవుడ్‌లో బేబీ మూవీతో హీరోయిన్‌గా సాలిడ్ హిట్ అందుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ‘లవ్ మీ’ అనే రొమాంటిక్ హార్రర్ చిత్రంలో నటించిన ఆమెకు ఫెయిల్యూర్ ఎదురైంది.

దీంతో ఆమె సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన ‘జాక్’ మూవీపై ఆమె భారీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ‘జాక్’ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్ దక్కడంతో ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో వైష్ణవికి మరో ఫెయిల్యూర్ ఎదురైంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురవడంతో వైష్ణవి ప్లాన్ తేడా కొట్టిందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్‌తో ఆమె తన నెక్స్ట్ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు