గెట్ రెడీ..ఒకరోజు ముందు నుంచే “వకీల్ సాబ్” జాతర.!

Published on Jan 13, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. పింక్ సినిమాకు రీమేక్ గా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. చాన్నాళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న కం బ్యాక్ ఇవ్వడంతో దీనికి సాలిడ్ రికార్డులు అందించాలని ఫిక్స్ అయ్యిపోయారు.

మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో మేకర్స్ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను విడుదల చెయ్యడానికి టైం ఫిక్స్ చేశారు. ఈ సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ ను ప్లాన్ చేశారు. కానీ అందుకు ఒకరోజు ముందే సరిగ్గా టీజర్ విడుదల చేసే సమయానికి ఓ అలెర్ట్ పోస్టర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో పవన్ ఫాన్స్ ను మేకర్స్ మరింత కిక్కివ్వనున్నారని చెప్పాలి. మరి ఈరోజు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కు సాలిడ్ రికార్డులు అందించాలని చాలా మంది ఫిక్స్ అయ్యి ఉన్నారు. మరి దీనికి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం ఇచ్చాడు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More