ఈసారి “వకీల్ సాబ్” నుంచి మాస్ నెంబర్.?

Published on Feb 23, 2021 11:07 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసమే ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అయితే దాని కన్నా ముందు మాత్రం థమన్ ప్రిపేర్ చేస్తున్న ఈ చిత్రం తాలుకా ఫుల్ ఆల్బమ్ కోసం చూస్తున్నారు.

ఇప్పటి వరకు ఒక్క పాటను మాత్రమే వదిలిన చిత్ర యూనిట్ వచ్చే నెల నుంచే మిగతా పాటలు అన్ని విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే సరిగ్గా గత ఏడాది మార్చ్ 5న ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. మళ్ళీ ఈ ఏడాది ఈ పాటలు వస్తున్నాయి. అయితే అప్పుడు ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మెలోడీతో రాగా ఈ సారి ఒక మాస్ అండ్ ఇన్స్పిరేషన్ నెంబర్ తో వస్తున్నారా అన్న టాక్ వినిపిస్తుంది.

అలాగే దానికి “సత్యమేవ జయతే” అనే లైన్ కూడా వైరల్ అవుతుంది. ఇది వరకే మోషన్ పోస్టర్ టీజర్ లో ఈ లైన్ వినిపించింది దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దానిపైనే ఇపుడు హింట్స్ వినిపిస్తున్నాయి. మరి అదే సాంగ్ ను విడుదల చేస్తారా లేక మరేమన్నా వదులుతారో అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :