‘వకీల్ సాబ్’ టీజర్ : కొలిచి కొలిచి కట్ చేశారు

Published on Jan 14, 2021 6:58 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా కావడం, టీజర్ మీద బోలెడన్ని అంచనాలు ఉండటంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా టీజర్ కట్ చేశారు. టీజర్ మొత్తం పవన్ తప్ప మరొక ముఖ్యమైన పాత్ర కనిపించలేదు. అచ్చంగా పవన్ కళ్యాణ్ పునరాగమనం కోసమే తయారుచేసిన టీజర్ ఇది.

వకీల్ పాత్రలో పవన్ వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ’ తెలుసు అనే పంచ్ డైలాగ్ వేసి చెప్పేశారు. ఇక పవన్ మార్క్ క్రేజీ షాట్స్ టీజర్ నిండా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైట్ షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. పిఎస్ వినోద్ కెమెరా వర్క్ పవన్ ను చాలా బాగా చూపించింది. అభిమానులైతే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి చెందుతారు. ఇక తమన్ నేపథ్య సంగీతం మళ్లీ వినాలనిపించేలా ఉంది. మొత్తం మీద టీజర్ చూస్తే అభిమానుల కోసమే కొలిచి కొలిచి ఏయే అంశాలు ఉండాలో వాటినే ఉంచి కట్ చేసినట్టు ఉంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More